Kanchi Mahender : వడ్డె ఓబన్న స్మరణ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్

TRINETHRAM NEWS

కూకట్పల్లి జనవరి 11 (త్రినేత్రం న్యూస్) : బాలానగర్ మూసా పేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలోని వడ్డెర సంఘం ఆహ్వానం మేరకు, ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న స్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్ వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన వడ్డే ఓబన్న చేసిన దేశభక్తి, త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా కంచి మహేందర్ మాట్లాడుతూ, వడ్డె ఓబన్న పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సాధన కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల సేవలను గుర్తుచేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.
ఈ స్మరణ కార్యక్రమంలో బలేశ్, సురేష్, లడ్డు, దాశరథ్, కిషాన్, బొట్టు శ్రీను, శ్రీనివాస్, గిరి, లక్ష్మణ్ తదితరులు పాల్గొని వడ్డె ఓబన్న కి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమం శాంతియుతంగా, స్ఫూర్తిదాయక వాతావరణంలో ముగిసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kanchi Mahender participated in the Vadde Obanna memorial program

You cannot copy content of this page

Scroll to Top