Sahabash Anand Rao : సహాబాష్ ఆనందరావు… సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీగా అమలాపురం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, అమలాపురం మునిసిపాలిటీని ఫస్ట్ గ్రేడ్ నుండి సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అమలాపురాన్ని అభివృద్ధి చేయాలంటే కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్ స్థాయికి వెళ్లాలన్న ఎమ్మెల్యే ఆనందరావు ఊహకు తొలి అడుగు పడింది.

సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీగా గుర్తిస్తూ ప్రభుత్వం జి ఒ జారీ చేసింది. ఇప్పటికే మూడు మేజర్ పంచాయితీ లో కొంత భాగాన్ని మున్సిపాలిటీ లో కలిపేందుకు ఈదరపల్లి, పేరూరు గ్రాభ సభల్లో ఆమోదం పొందింది. ఎమ్మెల్యే చొరవతో రెండు రోజుల్లో కామనగరువు పంచాయతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రస్తుతం వున్న 30 వార్డులు స్థానే మూడు గ్రామాలు కలుపుకుని 40 వార్డులుగా మున్సిపాలిటీ రూపాంతరం చెందనుంది. తదుపరి కార్పొరేషన్ సాధన లో భాగంగా పట్టణానికి చేరువుగా వున్న 7 పంచాయతి లను కలిపేందుకు తదుపరి పావులు ఎమ్మెల్యే ఆనందరావు కదుపుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sahabash Anand Rao

You cannot copy content of this page

Scroll to Top