Savitribai Phule Jayanti : సావిత్రి బాయి పూలే జయంతి

TRINETHRAM NEWS

-భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే
-మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

దేవరకొండ డివిజన్ జనవరి 03 త్రినేత్రం న్యూస్. సమాజంలో అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి సావిత్రిబాయి ఫూలే అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శనివారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..మహిళా హక్కుల కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే అని ఆయన అన్నారు.భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఆయన అన్నారు.ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన గొప్ప ఉద్యమ కారిణి సావిత్రి భాయి పూలే అని ఆయన అన్నారు.

స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమ కారిణి సావిత్రి భాయ్ పూలే అని కొనియాడారు.కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అన్నారు.సావిత్రి భాయ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఒక్క మహిళా ఉపాధ్యాయినిలు కృషి చేయాలన్నారు.

ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రి భాయ్,తన భర్తతో కలసి1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు.కుల వ్యవస్థకు,పితృస్వామ్యానికి వ్యతిరేకంగా,శూద్రుల,అస్పృశ్యుల,మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారని గుర్తు చేశారు.

నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిందని కొనియాడారు.ఆమె ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరం పాటు పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Savitribai Phule Jayanti

You cannot copy content of this page

Scroll to Top