వికారాబాద్ జిల్లా ప్రతీనిది త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ జరిగే పద్ధతి చాలా గందరగోళంగా ఉంది. స్పీకర్ మాట్లాడే పద్ధతి అస్సలు బాగాలేదు.
“ముఖ్యమంత్రి ని విమర్శిస్తే ప్రతిపక్షా లకు మైకు ఇవ్వను అని చెప్పటం రాజ్యాంగ విరుద్ధం. ప్రతిపక్షాలు అసెంబ్లీకి వచ్చేది ప్రజల పక్షాన పోరాడటానికి కానీ, ముఖ్యమంత్రి ని పొగడటానికి కాదు అని స్పీకర్ గుర్తుపెట్టుకోవాలి.
ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం అంటే ప్రజల గొంతు నొక్కటమే. మూసి కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంటే ఎక్కువగా ఉంది మూసి ప్రక్షాళన కంటే ముందు ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్ తో ప్రక్షాళన చేయాలి.
స్పీకర్ ఇప్పటికైనా అసెంబ్లీ రూల్స్ చదువుకొని, ప్రతిపక్షాలకు ఉన్నటువంటి హక్కులను కాలరాయకుండా మెలగాలి. స్పీకర్ అంటే ప్రతిపక్షాలకు అధికారపక్షాలకు సమానంగా అవకాశాలు ఇవ్వాలి. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. పక్షపాత ధోరణి వీడాలి. చేతకాకపోతే స్పీకర్ పదవి వదలాలి.అని బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనందు తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


