TRINETHRAM NEWS

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం

Trinethram News : ఈనెల 26వ తేదీన అనగా శుక్రవారం ఉదయం 8 గంటలకు ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమం కలదు. అదేవిధంగా ఉదయం 10 గంటలకు కూసుమంచిలోని పాలేరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం కలదు. కావున ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లోని అన్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై గణతంత్ర దినోత్సవ వేడుకలను జయప్రదం చేయగలరు.

ఇట్లు
తుంబూరు దయాకర్ రెడ్డి
మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్