ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు
త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి. సింగరేణిలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మారు పేర్లు (అలియాస్ నమేస్తే) మరియు విజిలెన్స్ కేసుల బాధితుల సమస్యలను ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన ప్రజాప్రతినిధులకు బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు తమ ఆవేదనను పంచుకున్నారు.
ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అలాగే కార్మిక నాయకులు జనక్ ప్రసాద్ ఐఎన్టియుసి సీతారామయ్య (ఏఐటీయూసీ) ఈ సందర్భంగా బాధితులు ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రధాన డిమాండ్లు మరియు విజ్ఞప్తులు: తక్షణ పరిష్కారం: గత ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా మా సమస్య ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుత సెషన్లోనూ చర్చ జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన పరిష్కారం లభించకపోవడం బాధాకరం.
లీగల్ అడ్డంకులు చూపవద్దు: మారు పేర్ల సమస్యకు కేవలం ‘లీగల్ ఇష్యూస్’ (చట్టపరమైన చిక్కులు) ఉన్నాయని సాకులు చెప్పి కాలయాపన చేయవద్దు. చట్టపరంగా ఎలాంటి బాధ్యతకైనా మేము సిద్ధంగా ఉన్నాము.
డిఎన్ఏ పరీక్షకు సిద్ధం: మా వారసత్వాన్ని నిరూపించుకోవడానికి మెడికల్ పరంగా ఎలాంటి ఆధారాలు కావాలన్నా, చివరకు డిఎన్ఏ టెస్టులు చేయించుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని బాధితుల పిల్లలు స్పష్టం చేశారు.
ఉద్యోగ కల్పన: విజిలెన్స్ పేరుతో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఫైళ్లను తక్షణమే పరిష్కరించి, అర్హులైన వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రావణ్ గౌడ్, దానడ రాజు, డిష్ బాబు, సందీప్, కుమార్, జిల్లాల శ్రావణ్, గుర్రం సుధాకర్, అంజయ్య మరియు పలువురు మాజీ కార్మికులు, బాధితులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


