SP Speha Mehra : జిల్లాలో పెరిగిన క్రైం రేట్

TRINETHRAM NEWS

వార్షిక నేర నివేధిక విడుదల
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ స్పేహా మెహ్రా
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్‌ జిల్లాలో ఈ యేడాది నేరాల నమోదు స్వల్పంగా పెరిగినట్లు జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా వెల్లడించారు.

మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ స్నేహా మెహ్రా జిల్లాలోని అన్ని డివిజన్‌ల డిఎస్పీలతో కలిసి వార్షిక నేర నివేధికను ప్రకటించారు. గత యేడాది 2024తో పోలిస్టే ఈయేడాది 2025 డిసెంబర్ నాటికి క్రైం రేట్ స్వల్పంగా పెరిగిందని చెప్పారు. గత యేడాది నవంబర్ నాటికి 3691 కేసులు నమోదైతే ఈసారి 3813 కేసులు నమోదయ్యాయని తెలిపారు.

ఈ లెక్కన ఈయేడాది 3.31శాతం నేరాలు పెరిగాయన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతిభదత్రలను పరిరక్షించడంతో పాటు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. క్రిస్మస్ పండగతో పాటు న్యూఇయర్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Crime rate increased in the district

You cannot copy content of this page

Scroll to Top