–బీఆర్ఎస్ పార్టీలో ఊపందుకున్న చేరికలు
-కేసీఆర్ హయాంలోని అభివృద్ధి, సంక్షేమానికే జై కొడుతున్న పల్లెలు
-బీఆర్ఎస్ తోనే నియోజకవర్గ సమగ్రాభివృద్ధి
-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 08 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లెపల్లి మండలం పెండ్లిపాకుల గ్రామ పంచాయతీ పరిధిలోని ఇస్లావత్ తండాకు చెందిన 20కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలను రమావత్ రవీంద్ర కుమార్ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….బీఆర్ఎస్ తోనే నియోజకవర్గ సమగ్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, అంకిత భావంతో పని చేయాలని, బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి గ్రామాల్లో చైతన్యం కల్పించాలని ఆయన తెలిపారు. పార్టీలో చేరిన వారు మాజీ ఉప సర్పంచ్ బాలు నాయక్,జాను, జగపతి, రమ్యా ,రాజు,సికిందర్, బావు సింగ్, తదితరులు ఉన్నారు.
కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు నేనావత్ శంకర్ నాయక్, ఎట్టెల్లి రాంబాబు, పిల్లి పరమేష్, నెతళ్ళ ఏల్లయ్య,కుమార్, అమర్ సింగ్, బట్టు కొండల్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


