MLA KP Vivekanand : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదయాలను మతసామరస్యానికి ప్రతీకగా అభివృద్ధి పరుస్తాం

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు దుండిగల్ మున్సిపాలిటీ పరిధి దుండిగల్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలలో నూతనంగా నిర్మించిన మస్జిద్ – ఈ – మెహబూబున్నిస బేగం & మెహబూబా అక్తారి మస్జిద్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలలో అన్నీ వర్గాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూ మతసామరస్యానికి ప్రతీకగా ప్రార్థన మందిరాలను నిర్మించుకునేలా స్థలాన్ని కేటాయింపచేస్తూ అభివృద్ధి పరుస్తామన్నారు. అనంతరం మస్జిద్ లో ప్రారంభోత్సవ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, జక్కుల కృష్ణా యాదవ్, సాయి యాదవ్, పాక్స్ డైరెక్టర్ వెంకటేష్, కమిటీ సభ్యులు మహమ్మద్ నయ్యర్ సాబ్, ఎండీ.రాహత్ అలీ, షేక్ గౌస్, మహమ్మద్ చాంద్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will develop double bedroom housing complexes

You cannot copy content of this page

Scroll to Top