MP Konda Vishweshwar Reddy : వికారాబాద్ పట్టణం లొ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం గ్రామీణ వికాసం బీజేపీతోనే సాధ్యం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, 2024 లో కొత్తగా వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసి రెండు సంవత్సరాలు ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా గ్రామాలలో పరిపాలన పూర్తిగా అదుపు తప్పింది. గ్రామ పంచాయతీలకు నిధులు రాక గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులతో పాటు సహా ఎవరికి సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసింది.

2023 లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 6 గ్యారంటీ హామీ హామీలలో ఒకటి నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తుంది స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి అందులో సగం కన్నా తక్కువ 17%తోనే సరిపెట్టింది. మహిళలకు ప్రతి నెల 2500 ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తానని చెప్పి మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, 15 వేల పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,వేల సాయం చేస్తామని హామీ కూడా ఇచ్చింది కానీ ఆ హామీని తుంగలో తొక్కి ంది. నిరుద్యోగులకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ హామీ ఇచ్చింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఏడాదిలోపు 1, నియామకాలు పేదలకు ఇందిరమ్మ ఇంట్లో నాలుగువేల పెన్షన్, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420 హామీలు ఉన్నాయి. అంతకుముందు, తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది. ఎమ్మెల్యే సిఫారసుల ఆధారంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసి అర్హులైనతో మందికి రేషన్ కార్డు నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఇవ్వకుండా మోసం చేసింది.

మోడీ ప్రభుత్వం గ్రామాలకు నేరుగా పంపించిన ఆర్థిక సంఘం నిధులను నల్ల బిల్లులు, విద్యుత్ బిల్లుల బకాయల పేరిట పక్కదారి పట్టించింది. గ్రామపంచాయతీ శాఖలో ఉన్న నిధులను వినియోగించుకోనివ్వకుండా ఫ్రిజ్ చేసింది. నీళ్లు నిధులు నియామకాలు అంటూ పోరాడి సాధించుకున్న తెలంగాణ టిఆర్ఎస్ కుటుంబ పాలనలో అధోగతి పాలైంది. గ్రామీణ వికాసం బీజేపీతోనే సాధ్యం
గ్రామాలు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక చర్యలు చేపట్టారు. ఉచిత బియ్యం, ఇండ్లు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు, 5 లక్షల ఉచిత వైద్యం, పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకు, వంటివి బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం ఇసుక మైనింగ్ వంటి కార్యకలాపాల వల్ల రావాల్సిన రాయల్టీ ఫీజును, రిజిస్ట్రేషన్ ఫీజులో,గ్రామాలకు రావాల్సిన వాటాను గ్రామపంచాయతీలకు అందించకుండా కాంగ్రెస్,బిఆర్ఎస్, ప్రభుత్వాలు గ్రామాల గొంతు కోశాయి. సర్పంచుల అధికారాలకు కోత పెట్టి వారిని ఉత్సవ విగ్రహాల మార్చాయి. కాంగ్రెస్,బిఆర్ఎస్, తో మన ఊర్లో బాగుపడవు గ్రామాలను అన్ని విధాల ఆదుకుంటున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపి వల్లే మన ఊర్లో బాగుపడతాయని ఆయన అన్నారు. అందుకే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో వికారాబాద్ జిల్లా మాజీ బిజెపి పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, వికారాబాద్ జిల్లా నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు, శ్రీధర్ రెడ్డి,నరోత్తమ్ రెడ్డి పాండు గౌడు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MP Konda Vishweshwar Reddy's press conference

You cannot copy content of this page

Scroll to Top