Trinethram News : గోవాలోని ఓ నైట్ క్లబ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 23 మంది మరణించారు. అర్పోరా ప్రాంతంలోని బిర్చ్ నైట్ క్లబ్లో సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. 23 మంది మరణించగా అందులో నలుగురు పర్యా టకులు, మిగతా అందరూ క్లబ్ సిబ్బందిగా తెలుస్తోంది. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. ఘటనాస్థలాన్ని సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు.
గోవాలో ప్రమాదానికి కారణం ఏంటంటే?
గోవాలో జరిగిన ఘోర ప్రమాదంలో మొత్తం 23మంది ప్రాణాలుకోల్పోయారు. ఘటనాస్థలాన్ని సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.’ఈ ప్రమాదంపై పూర్తి దర్యాప్తునకు ఆదేశిస్తాం. ముగ్గురు మహిళలు, నలుగురు పర్యాటకులు సహా 23మంది చనిపోయారు. క్లబ్లో సేఫ్టీ రూల్స్ పాటించలేదని ప్రాథమికంగా సమాచారం అందింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సీఎం తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


