Bandi Ramesh : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం

TRINETHRAM NEWS

కూకట్పల్లి డిసెంబర్ 6 (త్రినేత్రం న్యూస్) : స్వయంకృషితో దేశ అత్యున్నత స్థాయికి ఎదిగిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కెపిహెచ్బి కాలనీ ఫోర్త్ ఫేస్ లో బాబ్జి ఆధ్వర్యంలో, మరియు బోయిన్ పల్లి లో దండుగుల యాదగిరి ఆధ్వర్యంలో ఉన్న ఆయన విగ్రహానికి రమేష్ స్థానిక నాయకులతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమీ లేని స్థాయి నుంచి దేశఅత్యున్నత స్థాయికి ఎదగడం అంటే సామాన్య విషయం కాదని, అలాంటి వ్యక్తి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఎదగాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసి భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, కెపిహెచ్బి డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, బోయిన్పల్లి డివిజన్ ప్రెసిడెంట్ మల్లికార్జున యాదవ్, అప్పారావు, శివ చౌదరి, నలినీకాంత్, శ్రీరాములు, రాజు ముదిరాజ్, మార్కెట్ డైరెక్టర్ రాజేందర్, అస్లాం సోఫీ, షహేన్షా, గౌస్ ,అక్రమ్ ,అస్లాం పాషా, రజిత ,సంధ్య ,కల్పన, సభ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The life of Dr. B. R. Ambedkar is very inspiring for today's youth.

You cannot copy content of this page

Scroll to Top