జూన్ 26, 2026
TRINETHRAM NEWS

కూకట్పల్లి డిసెంబర్ 6 (త్రినేత్రం న్యూస్) : ఈ రోజు జగద్గిరిగుట్టలో 42% బీసీ రిజర్వేషన్ల కోసం సాగుతున్న ఉద్యమంలో భాగంగా తన ప్రాణాలని అర్పించిన అమరవీరుడు సాయి ఈశ్వరా చారి పార్ధిక దేహానికి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాధారం రాజలింగం, కూకట్‌పల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, కుత్బుల్లాపూర్ ఇంచార్జి నందగిరి సతీష్ నివాళ్ళులు అర్పించారు. సాయి ఈశ్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించి అమరవీరుని కుటుంబానికి మనోధర్యం కల్పించి అర్ధిక సహాయం గా ప్రేమ కుమార్ వారికి 25,000/– రూపాయలు సహాయం చెయ్యటం జరిగింది.

బీసీ హక్కుల కోసం పోరాడుతూ అమరుడైన సాయి ఈశ్వరా చారి త్యాగం వృథా కాకుండా ఉండేలా పార్టీ తరఫున న్యాయపోరాటం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయం కోసం, బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ఒక యువ ఉద్యమకారుడు ప్రాణత్యాగం చేయడం ఎంతో బాధాకరమని, అలాంటి త్యాగాలు ప్రభుత్వాన్ని కదిలించేలా ప్రజా ఉద్యమాలు మరింత బలపడాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దుర్గా ప్రసాద్ , వేముల మహేష్, కలిగినీడి ప్రసాద్,పోలేబోయిన శ్రీనివాస్, వీర గడ్డం, కార్యకర్తలు, హాజరై సాయి ఈశ్వరా చారికి నివాళులు అర్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janasena leaders paid tribute to BC activist Sai Eshwara Chari

You cannot copy content of this page