WhatsApp Image 2024 01 24 at 4.29.14 PM
Trinethram News : కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’లో అప్లికేషన్లు.. ఎప్పటి నుంచి అంటే..
New Ration Cards : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా అధికారికంగా మీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుదారుల నుంచి ఫిబ్రవరి నెలాఖరులోగా అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఫిబ్రవరి చివరి వారంలో మీసేవా ద్వారా అప్లై చేయొచ్చు. అభయహస్తం పేరుతో మొత్తం 5 గ్యారెంటీలకు దాదాపు కోటి పది లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం, ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారే ఉన్నారు. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో స్క్రూటినీ చేయడం త్వరగా అయ్యే పనికాదు. దీనివల్లే రేషన్ కార్డుల కోసం అధికారికంగా మీసేవా ద్వారా అప్లికేషన్లను స్వీకరించాలని డిసైడ్ చేశారు. కొత్త రేషన్ కార్డులతో(New Ration Cards) పాటు రేషన్ కార్డుల్లో పేరు లేని వారు కూడా మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట
