పార్టీ కష్టకాలంలో అండగా నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతీ ఒక్కరికీ భవిష్యత్ లో సముచిత స్థానం.
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 04 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం డిండి మండలపరిధిలోని రహమంతాపురం గ్రామానికి చెందిన 20మంది యువకులు బిఆర్ ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజి శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….పార్టీ కష్టకాలంలో అండగా నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతీ ఒక్కరికీ భవిష్యత్ లో సముచిత స్థానం ఉంటుంది అని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా అని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవీందర్ రావు, వెంకట్ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


