Joinings in BRS : బీ ఆర్ ఎస్ లో చేరికలు

TRINETHRAM NEWS

అనాజిపురంలో బీ ఎస్ పి కి,కాంగ్రెస్ కి షాక్ .
బీఆర్ఎస్ తోనే నియోజకవర్గ సమగ్రాభివృద్ధి .
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష
గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ హీటెక్కిన రాజకీయం
బీఆర్ఎస్ లో ఊపందుకున్న చేరికలు
గులాబీ తీర్థం పుచ్చుకున్న బీ ఎస్ పి,కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 01 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.చింతపల్లి మండలంలో అనాజిపురం గ్రామం గ్రామానికి చెందిన బీ ఎస్ పి మండల అధ్యక్షులు ముదిగొండ మొగిలయ్య తోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలను రవీంద్ర కుమార్ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..బీఆర్ఎస్ తోనే నియోజకవర్గ సమగ్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, అంకిత భావంతో పని చేయాలని, బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి గ్రామాల్లో చైతన్యం కల్పించాలని ఆయన తెలిపారు.అనంతరం అనాజీపురం గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముదిగొండ అనితమొగిలయ్య ను బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రకటించారు.పార్టీలో చేరిన వారిలో అనిత,నాగరాజు, కొండల్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్,అశోక్,సుదీర్,శ్రీకాంత్,విష్ణువర్ధన్, రవి,నర్సింహ,కృష్ణయ్య, లక్ష్మయ్య, ధర్నా రెడ్డి,సాయి రెడ్డి,మధు,జంగయ్య,మహేష్,రమేష్, తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి,రమావత్ రమేష్,తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Joinings in BRS

You cannot copy content of this page

Scroll to Top