HAL : హెచ్.ఏ.ల్ లో ఘనంగా ఫూలే వర్ధంతి వేడుకలు

TRINETHRAM NEWS

మహాత్మాజ్యోతిరావు ఫూలే సేవలు మరువలేనివి హెచ్.ఏ.ల్ డీజీమ్ హెచ్.ఆర్. సూర్యకుమార్ రౌత్

కూకట్పల్లి నవంబర్ 28 (త్రినేత్రం న్యూస్) : హెచ్.ఏ.ల్ ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షులు రవికుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బాలానగర్ డివిజన్ హెచ్.ఏ.ల్ పరిశ్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతి రావు ఫూలే 135వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హెచ్.ఏ.ల్ డీజీమ్ హెచ్.ఆర్. సూర్యకుమార్ రౌత్ హాజరై విగ్రహానికి ఫూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజానికి చేసిన సేవలు మరువలేనివని ఆయన ను ఆదర్శనంగా తీసుకుని యువత సమాజానికి బడుగు బలహీన వర్గాల కు సేవ చేయాలని పిలుపు నిచ్చారు. ఫూలే విద్య యొక్క ప్రాముఖ్యత ను తెలుసుకొని తన భార్య అయిన సావిత్రి భాయ్ ఫూలే కు విద్య ను నేర్పించి ఆమె ద్వారా పాఠశాలలను ఏర్పాటు చేసి ఎంతో మంది మహిళాలకు విద్యను అందించిన గొప్ప దంపతులుగా చరిత్రలో నిలిచిపోయారని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ అసోసియేషన్ లైసన్ ఆఫీసర్ శ్రీహరి రావు, హెచ్ ఆర్ చీఫ్ మేనేజర్ ప్రహ్లాద్, ఓబీసీ సీనియర్ లీడర్ అడ్వైసర్ రాంచంద్రయ్య, గుర్తింపు యూనియన్ అధ్యక్షులు మరియు కన్వీనర్ కె. వేంకటాద్రి,గౌరవ అధ్యక్షులు విజయప్రసాద్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కర్కనాగరాజు,చంద్రరావు నాయక్, ఏస్సీ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు ఎస్. టి. అసోసియేషన్ అధ్యక్షులు చూడమన్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్, సుబ్బయ్య, జీవన్, యశ్వంత్,జయశ్రీ, శాంతి, పల్లవి, భాగ్య, తిమ్మయ్య, భాస్కర్రావు,తమ్మడి మహేందర్,క్రాంతికుమార్, చలం, జోగారావు,నాగేశ్వర్ రావు,లక్ష్మణ్, ఉప్పలయ్య, విజయ్,సురేష్,ఆంజనేయులు,మహేందర్,కిషన్ నాయక్, బాబీ, కృష్ణబాబు, నాగార్జున, ప్రవీణ్,వెంకటపతి,అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు, వివిధ అసోసియేషన్స్ నాయకులు వారి కార్యవర్గ సభ్యలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

HAL celebrates Phule's death anniversary with great pomp

You cannot copy content of this page

Scroll to Top