వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: తాండూరు డిఎస్పిని అంబేద్కర్ ప్రజా సంఘం జిల్లా కన్వీనర్ బి జే వెంకటేష్ సన్మానించారు. బుధవారం తాండూర్ డిఎస్పి కార్యాలయంలో డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్యను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పుష్పగుచ్చంతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పి నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ ప్రజా సంఘంలో ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు. తాండూర్ డివిజన్లో నేరాల నియంత్రణకు తన వంతుగా కృషి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాంబినా,సీనియర్ జర్నలిస్టు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


