MLA KP.Vivekanand : జీవో నెంబర్. 27ను వెంటనే ఉపసంహరించుకోవాలి

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు నగరంలోని జిహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి హాజరైన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మరియు నగరానికి చెందిన ఇతర బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవో నెంబర్ 27 ద్వారా వేలంపాటతో ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ తీరును మీడియా ముఖంగా దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి ఒకటే సింగల్ అజెండాతో ఎక్కడైతే విలువైన భూములు ఉన్నాయో, వాటిని ఎలా కొల్లగొట్టుకోవాలో, ఈ విధంగా తన అనుచరులకు, సోదరులకు, కుటుంబ సభ్యులకు పంచి పెట్టుకోవాలా అనేదానిపైనే సింగల్ ఎజెండాతో పనిచేస్తుంది.

తద్వారా ఇక్కడి నుంచి ఢిల్లీకి ఓటర్ ఎలా పంపించాలా అన్న ఏజెండాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగానే

గత రెండు సంవత్సరాలుగా మొదట మూసి పరివాహక ప్రాంతాల్లో భూముల సేకరిస్తామని చేసిన అరాచకం చూసాం.

ఎల్ అండ్ టి మెట్రో స్థలాలు దోచేయాలని, వాటిని కొల్లగొట్టాలనే ఆలోచనతో ఎల్ అండ్ టీ ని సాగనంపింది చూసాం.

ఆ తర్వాత కంచ గచ్చిబౌలి భూములు బ్యాంకులో తనకా పెట్టి పదివేల కోట్లు దండుకున్నది చూసాం.

కెసిఆర్ ఆధ్వర్యంలో ఫార్మాసిటీకై భవిష్యత్తు తరాల ఉద్యోగ, ఉపాధి కల్పనకై 20వేల ఎకరాలను సేకరిస్తే దానిని రద్దుచేసి అక్కడ కూడా భూ దందాలు చేసిన రేవంత్ రెడ్డి కొత్త భూ కుంభకోణానికి తెర లేపారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాలలోని 22 ఇండస్ట్రియల్ క్లస్టర్లలో 9292 ఎకరాలు (సుమారు 5 లక్షల కోట్ల విలువ ) గల భూములను 5000 కోట్లకు ధారాధాత్తం చేయడానికి నిర్ణయించుకొని ఈనెల 22న జీవో నెంబర్ 27ను తీశారు.

ఈ జీవో ద్వారా 5 లక్షల కోట్ల రూపాయల భూములను 5000 కోట్లకు కట్టబెట్టి మిగతాది ఎవరి జోబులోకి పోతున్నాయనేధి బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది.

హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులకు, ప్రజా అవసరాలకు, స్థలాలు లేవు.

9300 ఎకరాల స్థలాలను ఇక్కడి ప్రజానీకానికి ఉద్యోగ, ఉపాధికై పారిశ్రామిక వాడల ద్వారా కేటాయిస్తే వాటిని రెగ్యులరైజ్ చేస్తూ రేవంత్ రెడ్డి భూ దందాకు తెర లేపుతున్నాడు.

ఈ భూములను వారి అనుచరులు, కుటుంబ సభ్యులు, భాగస్వాములు, పినా మీ పేర్ల మీద అగ్రిమెంట్లు చేసుకొని ఇంటర్నల్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు.

ప్రభుత్వ భూములను కాజేసేందుకు విడుదల చేసిన జీవో. నెంబర్ 27ను వెంటనే ఉపసంహరించుకోవాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే ప్రజాక్షేత్రంలోని అన్ని వేదికలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం.

ప్రభుత్వం జీవో నెంబర్ 27ను వెంటనే రద్దుచేసి ఆ స్థలాలను ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, ఆసుపత్రులు, పేద ప్రజల అవసరాల రీత్యా వినియోగించాలన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం జీవో నెంబర్ 27ను ఉపసంహరించుకోవాలి.

జీవో నెంబర్ 27ను ఉపసంహరించుకోలేని పక్షంలో కనీసం 50 శాతం భూములను ప్రజా అవసరాలకు వినియోగించాలన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

G.O. No. 27 should be withdrawn immediately

You cannot copy content of this page

Scroll to Top