Ravindra Kumar : కేటీఆర్ పై కక్ష్య సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

TRINETHRAM NEWS

మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్.

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 20 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు , దేవరకొండ మాని శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. ఆయన మాట్లాడుతూ….. ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ కార్ రేస్ లో విచారణకు ఏసీబీ అనుమతి ఇస్తూ గవర్నర్ అనుమతి తెలపడంతో కాంగ్రెస్ బీజేపీ లు బిఆర్ఎస్ పార్టీ పై కలిసి కుట్రలు చేస్తున్నాయనేది తేటతెల్లామైందనీ తెలిపారు.

బిఆర్ఎస్ ను కట్టడి చేయడానికి కేటీఆర్ ని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయనీ ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల్లో ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేఖత వచ్చినపుడు, ఎలక్షన్ లు వచ్చినపుడు ఇలాంటి కేసుల అంశాన్ని తెరపైకి తెచ్చి రేవంత్ రెడ్డి డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నాడుఅని ఎద్దేవా చేశారు. రెండేండ్లుగా ఫార్ములా ఈ రేస్ పై విచారణ పేరుతొ కొండను తవ్వి ఎలుకను పట్టలేకపోయారనీ ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కక్ష్యపూరిత రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపింది.
అందులో భాగంగానే విచారణ పేరిట కేటీఆర్ ను ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు.ఫార్ములా ఈ కార్ రేస్ తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన కేటీఆర్ అక్రమ కేసులతో కేటీఆర్, బిఆర్ఎస్ నాయకులను కట్టడి చేయగలం అనుకోవడం పొరపాటే అని, కాంగ్రెస్ ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు అయ్యేవరకు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే ఉంటామని కేటీఆర్ కి బిఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. న్యాయస్థానాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది..మీరు చేసే కుట్రలను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We strongly condemn the actions of the KTR

You cannot copy content of this page

Scroll to Top