ప్రజల సమస్యలు స్వయంగా పరిశీలన. -రోడ్లు–విద్య–ఆరోగ్య రంగాలలో అభివృద్ధి హామీలు.
దేవరకొండ డివిజన్ నవంబర్ 20 త్రినేత్రం న్యూస్. జనహిత ఎమ్మెల్యే కార్యక్రమాలలో భాగంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో ‘మార్నింగ్ వాక్ విత్ పీపుల్’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామాన్ని అధికారులతో కలిసి పర్యటించారు. గ్రామంలోని ప్రతి సమస్యను పరిశీలిస్తూ అక్కడి ప్రజలతో మాట్లాడి వారి అవసరాలను స్వయంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
గ్రామ అభివృద్ధి మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని. ప్రజల శ్రేయస్సు కోసం మౌలిక సదుపాయాలను విస్తరించడంలో ఏ మాత్రం రాజీపడబోమని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించి మరింత వేగవంతం చేస్తాం అని ఆయన అన్నారు. గ్రామంలో కీలక అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్. మెయిన్ రోడ్ నుంచి దర్గా వరకు రహదారిని విస్తరించి సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని ,అలాగే గ్రామ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, అత్యాధునిక విద్యా సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 19 ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేస్తామని, అదనంగా 20 ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తూర్పుపల్లి నుంచి కోమటి తండా వరకు రహదారికి త్వరలో టెండర్ జారీ చేసి పనులను వేగంగా పూర్తి చేస్తామని హామీ, అంగన్వాడీ కేంద్రానికి సొంత భవన నిర్మాణం చేపడతామని తెలిపారు.
ప్రైమరీ హెల్త్ సెంటర్లో అదనపు మీటింగ్ హాల్ నిర్మాణం మరియు ప్రహరీ గోడ ఏర్పాటుకు అధికారిక అనుమతులు మంజూరు చేశారు. ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్కు కొత్త భవన నిర్మాణానికి , గ్రామ ప్రజల కార్యక్రమాలకు ఉపయోగపడే బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికిఎమ్మెల్యే ప్రత్యేక హామీ ఇచ్చారు.
పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులను ఆదేశిస్తూ, అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలిని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


