Vikarabad News : మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ ముమ్మటికి బూటకపు ఎన్కౌంటరని, ఇట్టి ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా ధ్యక్షులు నాగభూషణం మల్లన్న యాదయ్య డిమాండ్ చేశారు సామ్రాజ్యవాదులకోసం భారత సైన్యం దేశ పౌరులనే వేటాడటం అమానుషమని, మోడీ -అమిత్ షా ఓట్ చోర్లే
కాదు రక్తపిపాసులు అనేది నగ్నసత్యమన్నారు. మధ్య భారతం లోని ఖనిజలకోసం రక్త పూటేరులుపారిస్తున్నారన్నారు ఆదివాసులను ఆడవుల్లో నుండి వెళ్లగొట్టుటకు మానవ హననం సాగిస్తున్నారు. మర్చి, 2026 వరకు దేశంలో నెలకొన్న నిరుద్యోగం, ఆకలి చావులు, అసమానతలు రూపుమాపడం దళితులు,మహిళాల పై దాడులు అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పని చేయాలనీ, విద్యా, వైద్యం పేదలకు అందుబాటులోకి తీసుకురావడoలో కేంద్రం పనిచెయాలనీఅన్నారు. అడవులను, సహజ సంపదను కాపాడే అమాయక ఆదివాసులపై అమానుష దమనఖాండ ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని, సిపిఐ మావోయిస్టు పార్టీ తో శాంతి చర్చలు జరపాలని, బుద్దిజీవులు, హక్కుల సంఘాలు చేస్తున్నా డిమాండ్ చేస్తున్న కేంద్రం మొండి వైఖరి వీడటం లేదన్నారు. మారేడు మిల్లి అడవులోబూటకపు ఎన్కౌంటర్ లో అమరులైన కామ్రేడ్స్ మాడవి హిడ్మా, హేమ మరో నలుగురి మృతి పై సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలని.ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలని,మధ్యభారతంలోని పోలీస్ క్యాంపులనుఎత్తివేయాలని, ఆదివాసీ ప్రాంతాల్లో మొహరించిన సాయుధ పోలీస్ బలగాలను వెనక్కి రప్పించాలని, పోలీసుల అధీనంలో ఉన్న ఇతర మావోయిస్టు నాయకులకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టు లో హాజరుపరచాలని ఈ సందర్బంగా డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం మల్లన్న యాదయ్య

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A judicial inquiry should be conducted into the Maredumilli encounter

You cannot copy content of this page

Scroll to Top