Assistant Cook : మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ లో అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) నవంబర్ 19 త్రినేత్రం న్యూస్. డిండి(గుండ్లపల్లి) మండలకేంద్రం లోని మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్ (1) పోస్టుల నియామకానికి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాధికారి(ఎంఈవో) ఇస్లావత్ గోప్యా నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 నుండి 22వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.

దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరముల నుండి 45 సంవత్సరంల లోపు ఉండి 7వ తరగతి ఉత్తీర్ణత పత్రము, ఆధార్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికెట్ తోపాటు వంటలో అనుభవం కలిగిన పత్రాలను మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలోనీ కేర్ టేకర్ అశ్విని కి అందజేయాలని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Applications are invited for the post of Assistant Cook

You cannot copy content of this page

Scroll to Top