త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం కమలాపురం గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ… ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్టల్ నిర్వాహణపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.విద్యార్థుల రిజిస్టర్ లో అవకతవకలను గుర్తించి పద్దతి మార్చుకోవాలని ఇదే చివరి అవకాశమని హెచ్చరించారు.
అలాగే మెనూ ప్రకారం భోజనం అందించాలని నాసిరకం కూరగాయలు సరుకులు వాడితే తమరిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పాఠశాల పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని, వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.
ప్రభుత్వ లక్ష్యాలను నీరుగార్చవద్దని యాజమ్యాని హెచ్చరించారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


