Ketawat Bhilya Naik : మహమ్మద్ జావిద్ హుస్సేన్ ఖాస్మి సాహేబ్ మృతికి నివాళులు

TRINETHRAM NEWS

కేతావత్ భిల్యా నాయక్.

దేవరకొండ డివిజన్ నవంబర్ 17 త్రినేత్రం న్యూస్. దేవరకొండ జామియాతుల్ ఉలేమా నేత, ప్రముఖ ముస్లిం మత పెద్ద ముఫ్తి మొహమ్మద్ జావిద్ హుస్సేన్ ఖాస్మి సాహేబ్ అకస్మిక మరణం దేవరకొండ ముస్లిం సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్ అన్నారు.

ఈ సందర్భంగా భీల్యా నాయక్ మాట్లాడుతూ — ముఫ్తి సాహేబ్ యొక్క సరళమైన జీవన విధానం, ఆధ్యాత్మిక సేవలను స్మరించుకున్నారు. సమాజ శాంతి, సౌభ్రాతృత్వం కోసం ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరవలేనిదనిఅభిప్రాయపడ్డారు. సమాజానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని, ఆయన మరణం ముస్లిం సమాజానికి పెద్ద లోటని పేర్కొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తమ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జాని బాబ,నజీర్,హరి నాయక్, ముస్లిం మతపెద్దలు, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tributes to the death of Mohammed Javid Hussain Qasmi Saheb.

You cannot copy content of this page

Scroll to Top