Auto Overturned : తీవ్ర విషాదం

TRINETHRAM NEWS

20 మంది వున్న పత్తి కూలీ ల ఆటో బోల్తా.
కూలీలకు తీవ్ర గాయాలు.

దేవరకొండ డివిజన్ నవంబర్ 13 త్రినేత్రంన్యూస్. దేవరకొండ నియోజకవర్గం నేరేడు గొమ్ము మండలం బుగ్గ తండా సమీపంలో పత్తి కూలీల ఆటో బోల్తా పడింది ఈ సంఘటనలో మొత్తం 14 మంది కూలీలు గాయపడగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పీఏ పల్లి మండలం పెద్ద గుమ్మడం గ్రామానికి చెందిన సుమారు 20 మంది కూలీలు కూలి పని కోసం కాచరాజపల్లి వైపు ఆటోలో బయలుదేరారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో బుగ్గ తండాకు చేరుకోగానే అదుపు తప్పడం వల్ల ఆటో ఒకసారిగా బోల్తా పడింది రోడ్డుపై పడిన కూలీలు తీవ్ర గాయాలతో హా హా కారాలు చేశారు.
గాయపడిన వారందరినీ 108 అంబులెన్స్ ద్వారా దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మౌనిక కన్నమ్మ సునంద కమలమ్మ చింటూ అంజమ్మ వెంకటయ్య రమేష్ అరవింద్ వెంకటేసులమ్మ అఖిల రమణ ఉన్నారు. ప్రమాద విషయం తెలియగానే నేరేడు గొమ్ము ఎస్సై కే నాగేంద్ర తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఎస్సై నాగేంద్ర మాట్లాడుతూ ఆటోలో పరిమితికి మించి కూలీలను ఎక్కించడం వలన ప్రమాద తీవ్రత పెరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. రోడ్డు భద్రత నియమాలు పాటించకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హై

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A great tragedy

You cannot copy content of this page

Scroll to Top