Paramedical Staff : పారామెడికల్ సిబ్బందికి ప్రమోషన్లలో పదోన్నతులు కల్పించండి

TRINETHRAM NEWS

జేబీసీసీఐ ప్రకారం ప్రకాశం ప్రమోషన్స్ ఇప్పించగలరు.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి యాజమాన్యం ఇటీవల నిర్వహించిన స్ట్రక్చర్ కమిటీ మీటింగ్లో మెడికల్ డిపార్ట్మెంట్ క్యాడర్ నర్సింగ్ సిబ్బందికి ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఏ గ్రేడ్ లో ఐదు సంవత్సరాలు విధులో నిర్వహించిన సిబ్బందికి ఈ1 గ్రేడ్ (ఎగ్జిక్యూటివ్) ప్రమోషన్స్ కల్పించనున్నట్లు రికగ్నైజ్డ్ యూనియన్ యాజమాన్యాన్ని ఒప్పించడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రి ఏసిఎం ఓ డాక్టర్ అంబిక ద్వారా సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ ఏరియా ఆసుపత్రి పారా మెడికల్ సిబ్బంది వినతి పత్రం ఇచ్చారు. పారామెడికల్ క్యాడర్స్ అయిన ఫార్మాసిస్టులు, రేడియో గ్రాఫర్స్, సిటీ స్కాన్ టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫిజియోథెరపీ టెక్నీషియన్స్, డైటీషియన్, రిప్రాక్షనిస్ట్ లను కూడా జేబీసీసీఐ ప్రకారం ఇప్పటివరకు నర్సింగ్ సిబ్బంది లాగానే సమానంగా ప్రమోషన్స్ పొందారన్నారు.

అలాగే మిగతా క్యాడర్స్ అన్నిటికీ ప్రమోషన్స్ వచ్చే విధంగా కృషి చేయాల్సిందిగా యాజమాన్యాన్ని, గుర్తింపు సంఘాన్ని కోరారు. చీప్ టెక్నీషియన్స్ గా అన్ని క్యాడర్స్ కి ఏరియాల వారిగా అర్హత గల వారికి ప్రమోషన్స్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న, డి వై సి ఎం ఓ శ్రీనివాస్, పారా మెడికల్ సిబ్బంది యాదవ రెడ్డి, బి డి శాస్త్రి, ముక్తార్, బాలచందర్, సుచరిత, వెంకటేశ్వర్లు, పద్మలత, రత్నమాల, శ్రీనివాస్, హెప్సీ హెలెన్, శ్రీనివాస్, సంపత్, ఎక్సరే, ల్యాబ్, సిటీ స్కాన్, ఫిజియోథెరపీ, ఫార్మసిస్టులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Provide promotions to paramedical staff

You cannot copy content of this page

Scroll to Top