నవంబర్ 15-21 వరకు బస్సు జాత…
17 న డిండికి బస్సు జాత…
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి.
డిండి (గుండ్లపల్లి) నవంబర్ 12 త్రినేత్రం న్యూస్. డిసెంబర్ 26న,ఖమ్మంలో జరిగే సీపీఐ వందేళ్ల ముగింపు బహిరంగ సభను పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి .. బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి అన్నారు. బుధవారం డిండి సీపీఐ కార్యాలయంలో జరిగిన మండల సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసింహారెడ్డి మాట్లాడుతూ .. సిపిఐ వందేళ్ళ ముగింపు బహిరంగ సభ ఖమ్మంలో జరగనుందని డిసెంబర్ 26న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ముగింపు సభకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిని తరలించేందుకు ప్రజల్లో సీపీఐ చరిత్రను తెలిపేందుకు
ఈ ముగింపు సిపిఐ వందేళ్ళ ముగింపు బహిరంగ సభ ఖమ్మంలో జరగనుందని డిసెంబర్ 26న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ముగింపు సభకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిని తరలించేందుకు ప్రజలకు సీపీఐ చరిత్రను తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 3జాతలు బయలుదేరింది ఉన్నాయని నవంబరు 15 నుండి ప్రారంభమయ్యే ప్రచార జాతాలు రాష్ట్రవ్యాప్తంగా తిరగనున్నాయని నల్గొండ జిల్లాలో 17 నుండి ప్రవేశ్నించనుందని ఈ జాతాకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాల నరసింహ, సిపిఐ ఎమ్మెల్సీ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లికంటి సత్యం ఆధ్వర్యంలో జాత నవంబర్ 15 న, గద్వాల నుండి ప్రారంభమై 17న,డిండికి చేరనుందని తెలిపారు.
ఖమ్మంలో జరిగే సిపిఐ ఉండేళ్ల ముగింపు బహిరంగ సభకు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరై లక్షలాది మందితో జరిగాయి బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ గ్రామ శాఖలో సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని గ్రామ శాఖలో ఉత్సాహవంతమైన నాయకత్వానికి నూతన బాధ్యతలు అప్పజెప్పాలని సూచించారు పార్టీని మండలంలో మరిన్ని శాఖలకు విస్తరించి పటిష్టంగా గ్రామ శాఖలను ఏర్పాటు చేయాలని గ్రామ శాఖలో ప్రధానంగా మహిళలు రైతులు యువకులు విద్యార్థులు భాగస్వామ్యం అయ్యేలా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
సిపిఐ మండలం సహాయ కార్యదర్శి బొల్లె శైలేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూం బుచ్చిరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి.మైనోద్దీన్, సిపిఐ మండల కార్యదర్శి శ్రీ రామదాసు కనకాచారి, సహాయ కార్యదర్శి తిప్పర్తి విజయేందర్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు రవీంద్ర శర్మ, ఎలిమినేటి హుస్సేన్, హనుమాన్ల కేశవులు,సోమిడి శ్రీనయ్య,నూనె వెంకటేశ్వర్లు, లచ్చయ్య,శాఖ కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి,గొడుగు శ్రీను, శివ,చక్రి ఏ ఐ వై ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి నవీన్, ఏ ఐ ఎస్ ఎఫ్ డివిజన్ అధ్యక్షులు వినయ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


