Prize : రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీల్లో బహుమతి

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) నవంబర్12 త్రినేత్రం న్యూస్. డిండి మండలం కామేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి చదువుతున్న ముంత రాకేష్ కు తెలంగాణ సారస్వత పరిషత్, హైద్రాబాద్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీల్లో ద్వితీయ బహుమతి లభించింది.పర్యావరణం అనే అంశం పై చిత్రాన్ని గీసినందుకు ఈ బహుమతి లభించింది.బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం బాల బాలికలకు సృజనాత్మక రంగాల్లో పోటీలు నిర్వహించడం అనవాయితీ. ఈ సంవత్సరం చిత్రలేఖన పోటీల్లో పాఠశాలకు రాష్ట్రస్థాయి బహుమతి లభించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు పగిడిపాటి నర్సింహ మరియు మండల విద్యాధికారి గోప్య నాయక్, ఉపాధ్యాయులు,గ్రామస్తులు రాకేష్ ను అభినందించారు. ఈ నెల 23 న జరిగే కార్యక్రమంలో రాకేష్ నగదు తో పాటు జ్ఞాపిక ను అందుకోనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Prize in State Level Painting Competition

You cannot copy content of this page

Scroll to Top