Chilling Cold : వణికిస్తున్న చలి

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణలో ఈ నెల 11 నుంచి 19 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు తెలిపారు. మేడ్చల్, రంగారెడ్డి, కొమురం భీమ్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10°C కంటే తక్కువకు పడిపోవచ్చని అంచనా వేశారు. దక్షిణ, తూర్పు జిల్లాల్లో మోస్తరు చలితో ఉష్ణోగ్రతలు 14°C-17°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో బయటకు రాకుండా ఉండాలని వాతావరణ నిపుణులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chilling cold

You cannot copy content of this page

Scroll to Top