గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురాం నాయక్.
దేవరకొండ డివిజన్ నవంబర్ 11 త్రినేత్రం న్యూస్. దేవరకొండ ప్రాంతం చారిత్రకంగా, భౌగోళి కంగా, సాంస్కృతికంగా మరియు సామాజికంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని, అయినప్పటికీ అభివృద్ధి పరంగా తీవ్ర వెనుకబాటుతనం కొనసాగుతుందని గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురాం నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకొండను తక్షణమే స్వతంత్ర జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయన పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు.ఆయన మాట్లాడుతూ, దేవరకొండ ఖిల్లా చారిత్రకంగా పద్మరాజుల పాలనలో పరిపాలనా, సైనిక మరియు సాంస్కృతిక కేంద్రంగా నిలిచిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నంలో ఉన్న పూర్ణకుంభం కూడా దేవరకొండ ఖిల్లా నుంచే తీసుకెళ్లబడిందని చారిత్రక వాస్తవాన్ని గుర్తు చేశారు.
ఆయన అభిప్రాయంలో, ఈ ప్రాంతానికి చారిత్రక గుర్తింపు ఉన్నప్పటికీ ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు సరైన స్థాయిలో చేరలేకపోయాయి.దేవరకొండ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రధాన సమస్యలను ఆయన వివరించారు:ఉన్నత విద్యా సదుపాయాలు తక్కువప్రభుత్వ వైద్య వ్యవస్థ బలహీనంగా ఉందని ఆడపిల్లల విద్య, రక్షణ సమస్యలు ఇప్పటికీ తీవ్రముగా ఉన్నాయిగిరిజన గ్రామాల్లో త్రాగునీరు, రవాణా, ఉపాధి, వసతి వంటి కనీస వసతులు అందుబాటులో లేవుజిల్లా స్థాయి కార్యాలయాలు లేకపోవడంతో ప్రజలు చిన్న పనులకైనా దూర పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది“దేవరకొండ జిల్లాగా రూపుదిద్దుకుంటే పరిపాలన ప్రజలకు దగ్గరవుతుంది. అభివృద్ధి అన్ని గ్రామాల వరకూ సులభంగా చేరుతుందని ఇది ప్రాంత ప్రజల హక్కు మరియు సామాజిక న్యాయానికి కీలకమైన అంశం” అని బాబురాం నాయక్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేవరకొండ నుండి జిల్లా కేంద్రం నల్లగొండకు వెళ్లాలంటే దాదాపు 130 కిలోమీటర్లు ప్రయాణించాలి.
అదే విధంగా డిండి మండలం ప్రజలు నల్లగొండకు చేరుకోవాలంటే సుమారు 160 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. ఈ విస్తారమైన దూరాల మధ్యలో ప్రజలకు సహాయపడే ఏ ‘భోగి’ కేంద్రం లేదా ఉప పరిపాలనా కేంద్రం లేదు. దీంతో ప్రజలు ప్రతీ చిన్న ప్రభుత్వ పనికీ పెద్ద ఖర్చు, సమయం వెచ్చించాల్సి వస్తోంది. దేవరకొండను జిల్లాగా చేస్తే ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది, ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు సమృద్ధిగా అందుతాయి” అని ఆయన స్పష్టం చేశారు.“మా డిమాండ్‌ను న్యాయబద్ధంగా, రాజ్యాంగపరంగా సాధించుకుంటామని త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ నేతలు మరియు జాతీయ పార్టీలకు అధికారిక ప్రతినిధి పత్రం సమర్పిస్తాము. ప్రభుత్వం స్పందించే వరకు దేవరకొండ జిల్లాకు సంబంధించిన ఉద్యమం కొనసాగిస్తాం” అని చెప్పారు.ఈ కార్యక్రమంలో కేతావత్ మహేందర్, కోర్ర మకట్‌లాల్, రామావత్ సాయి, కట్ట భరత్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


