Trinethram News : మన గ్రామ అభివృద్ధి కోసం, ఇతర గ్రామాల్లో లేని విధంగా రెండు ప్రత్యేకమైన మరియు మహోత్కరమైన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాను.
1:ఉచిత కంప్యూటర్ శిక్షణ
ప్రతి సంవత్సరం ఎండాకాలం సెలవుల్లో
మన గ్రామంలోని ప్రతి విద్యార్థి, విద్యార్థిని
అలాగే యువతకు కూడా ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వబడుతుంది.
ఈరోజు టెక్నాలజీ అనేది తప్పనిసరి నైపుణ్యం.
భవిష్యత్తులో మన గ్రామ యువత మంచి స్థానాల్లో నిలబడాలని, మంచి ఉపాధి అవకాశాలు పొందాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిoచాలని అనుకున్నాను.
2: కరాటే శిక్షణ
ఈ రోజుల్లో ఆత్మ రక్షణ నైపుణ్యం ప్రతి ఒక్కరికీ అవసరం.
ముఖ్యంగా అమ్మాయిలకు ఇది అత్యంత అవసరమైన శిక్షణ.
ఈ కార్యక్రమం ద్వారా
చిన్నపిల్లలు
యువత
పెద్దలు కూడా
శారీరక దృఢత్వం, ధైర్యం, స్వీయ రక్షణ పట్ల అవగాహన పొందుతారు.
వ్యక్తి నిర్మాణమే గ్రామ అభివృద్ధికి పునాది.
గ్రామస్తుల సహకారం మరియు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ,
సదా మీ సేవలో,
మీ వి. ప్రశాంత్ చారి (B.E.,LL.B)
గోనయో ఫౌండేషన్ వ్యవస్థాపకులు
రాయపల్లి గ్రామం
రాజాపూర్ మండలం
జడ్చర్ల నియోజకవర్గం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


