Tribal Community Protests : పిఎం జన్మన్ హౌసింగ్ సమస్య పరిష్కరించాలని గిరిజన సంఘం ధర్నా

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ నవంబర్ 11 (త్రినేత్రం న్యూస్) : పిఎం జన్మన్ హౌసింగ్ 2.0 ఇళ్ల బిల్లులు, అదనంగా ప్రకటించిన లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు సుమారు 300 మంది లబ్ధిదారులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.
మండల కార్యదర్శి గత్తుం బుజ్జిబాబు, సర్పంచ్ గెమ్మెలి చినబాబు మాట్లాడుతూ “మండలంలో సర్వే చేసిన 4726 లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పెంచిన నిధులు ఒకేసారి ఖాతాల్లో జమ చేయాలి” అని డిమాండ్ చేశారు. గ్రామాభివృద్ధి పనులు, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ హాల్, మంచి నీటి వంటి సౌకర్యాలకు కూడా నిధులు కేటాయించాలని కోరారు.
సిపిఎం మండల కార్యదర్శి కిండింగి రామారావు మాట్లాడుతూ “పీవీటిజి ఆదివాసుల ఇళ్ల నిర్మాణ నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది” అని విమర్శించారు.
ఈ ధర్నాలో జిల్లా గిరిజన సంఘం కార్యదర్శి పొద్దు బాలాదేవ్, సిహెచ్. గురుమూర్తి, బి.దావీదు, కిలో ఆనందరావు, కొర్ర రాజశేఖర్, కే.దేవన్న, బురిడీ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tribal community protests

You cannot copy content of this page

Scroll to Top