Group-3 : నేటి నుండి గ్రూప్-3 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన!

TRINETHRAM NEWS

Trinethram News : నవంబర్ 10. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్పీ గ్రూప్-3 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-3 మెరిట్ జాబితాలో స్థానం సంపాదించిన అభ్యర్థులకు ఇవాళ సోమవారం నుండి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ వెరిఫికేషన్ నవంబర్ 26వ తేదీ వరకు కొనసాగనుంది.

గ్రూప్-3 పోస్టులకు ఎంపి కైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం హైదరాబాద్‌లోని నాంపల్లిలో గల తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగ ణంలో జరుగుతుందని టీజీపీఎస్పీ స్పష్టం చేసింది. వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా తీసుకురావాలి.అసలు సర్టిఫికెట్‌లతో పాటు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలను కూడా వెంట తీసుకురావాలని కమిషన్ సూచించింది.

వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన సమగ్ర వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని TGPSC సూచించింది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,388 గ్రూప్-3 పోస్టులను భర్తీ చేయనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Verification of certificates of Group-3 candidates

You cannot copy content of this page

Scroll to Top