దేవరకొండ డివిజన్, నవంబర్ 07 త్రినేత్రం న్యూస్. దేవరకొండ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశంలో అధ్యక్ష కార్యదర్శి తాడిశెట్టి నరసింహ, అంకం చంద్రమౌళి మాట్లాడుతూ 2025 – 26 సంవత్సరమునకు పెన్షనర్స్ తమ లైఫ్ సర్టిఫికెట్స్ ఆన్లైన్లో డిసెంబర్ 2025 లోపు సమర్పించవలసిందిగా ఒక ప్రకటనలో తెలిపారు. సకాలంలో లైఫ్ సర్టిఫికెట్లు అందజేయని వారికి జనవరి పెన్షన్ నిలుపుదల చేయబడుతుందని తెలియజేశారు.
ఇందు నిమిత్తమై పెన్షనర్స్ అందరూ ఐడెంటిటీ కార్డు ,ఆధార్ కార్డు, ఆధార్కు లింకు చేయబడిన ఫోన్ నెంబరు, బ్యాంకు పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తీసుకొని దేవరకొండ పెన్షనర్స్ కార్యాలయంలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమంలో గంగిడి దామోదర్ రెడ్డి ,ఆకులపల్లి ఐజాక్ ,శాంతకుమారి , బుచ్చయ్య ,యూసుఫ్ షరీఫ్, సత్యమూర్తి, నారాయణరెడ్డి, ఆలంపల్లి శ్రీనివాసులు, నాగమణి ,శ్రీనివాసులు, లక్ష్మయ్య , కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


