- విద్యార్థుల జీవితాలతో చెలగాటం.
- ఫ్యాకల్టీ లు లేకుండానే కాలేజ్ నిర్వహణ.
- కాలేజ్ యాజమాన్యం పై తగిన చర్యలు తీసుకోవాలి.
- విద్యార్థులు కళాశాలకు వస్తున్న గేటుకు తాళం.
- విద్యార్థులు వేరేచోట జాయిన్ అవుతమన్న టీ సి లు ఇవ్వని కళాశాల యాజమాన్యం. -సురగిరి వినయ్ .
దేవరకొండ డివిజన్ నవంబర్ 06 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర ఒకేషనల్ కళాశాలని కళాశాల యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెల గాటమాడుతున్నారనీ డివిజన్ అధ్యక్షుడు సురగిరి వినయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శ్రీ వెంకటేశ్వర ఒకేషనల్ కాలేజ్ చదువుతున్న మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం విద్యార్థుల పట్ల కళాశాల ప్రిన్సిపాల్ నిర్లక్షయంగా వ్యవహరిస్తున్నాడని గురువారం నాడు ఏఐఎస్ఎఫ్ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశ అధ్యక్ష వహించిన డివిజన్ అధ్యక్షుడు సురిగి వినయ్, ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ డిండి మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఒకేషనల్ కాలేజ్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కోరారు .
విద్యార్థులు కళాశాలకు వస్తున్న సరే కళాశాల గేటు మూసి వేస్తూ వచ్చిన విద్యార్థులు వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు ఎందుకు అని అడిగిన ఏఐఎస్ఎఫ్ వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం నాడు ధర్నా నిర్వహించడం జరిగింది, ఇది ఇలా ఉంటే విద్యార్థులతో అడిగి సమాచారం తెలుసుకున్నది ఏమనగా మా విద్యాభ్యాసం మొదలై సంవత్సరంలో సగం గడిచిపోయిన ఇప్పటివరకు పాఠాలు చెప్పకుండా ఉపాధ్యాయులు లేకుండా కళాశాలని నడిపిస్తున్నారు అని వాపోయారు . విద్యార్థులు వేరే చోటికి పోయి జాయిన్ అవుతాము మాయొక్క టీ సి లు మాకు ఇవ్వండి అని అడిగితే ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ప్రిన్సిపాల్ , మరియు యాజమాన్యంపై తగినచర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇలాగనే కొనసాగితే అఖిల భారత విద్యార్థి సమైక్య చూస్తూ ఊరుకోదని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఎంత దూరమైనా వెళ్తామని తెలియజేయడం జరిగింది, ఈ విషయంపై కలెక్టర్ దృష్టి కి, తీసుకెళ్తామని చెప్పారు.
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కళాశాల విద్యార్థులు, కళ్యాణ్, పవన్ రాజు సాయి శిల్పా శిరీష శివాని తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


