Chalo Hyderabad : విశ్రాంత ఉద్యోగుల చలో హైదరాబాద్ ధర్నా విజయవంతం చేయాలి

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 04 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఈనెల 7వ తేదీ న చలో హైదరాబాదు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవరకొండ నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని యూనిట్ అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ ,కార్యదర్శి అంకం చంద్రమౌళి, జిల్లా కార్యదర్శి కంచర్ల నారాయణరెడ్డి, సహా అధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు .

పెన్షనర్స్ కి హెల్త్ కార్డు పై అన్ని కార్పోరేటర్ హాస్పిటల్స్లో క్యాష్ లెస్ వైద్య సదుపాయం కల్పించాలని, ఐదు విడు తల కరువు భత్యం మంజూరు చేయాలని, పేడివిజన్ కమిషన్ అమలు చేయాలని ఉద్యోగ విరమణ ఉద్యోగులకు రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను అందజేయాలని, ముఖ్యమైన డిమాండ్లతో ఈ నెల 7న హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుందని, దేవరకొండ యూనిట్ నుండి అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో మంగళవారం ధర్నా పోస్టర్ ఆవిష్కరణ గావించారు .ఈ కార్యక్రమంలో పంగులూరు లింగయ్య, ఆకులపల్లి ఐజాక్ ,వనం బుచ్చయ్య ,యూసుఫ్ షరీఫ్, తాడిశెట్టి సుదర్శన్ ,తదితర సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The Chalo Hyderabad Dharna of retired

You cannot copy content of this page

Scroll to Top