త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి ఈరోజు జిల్లా పోలీస్ కార్యలయం లోని సెక్షన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ సెక్షన్ లో విధులు నిర్వహిస్తూ, అకాల మరణం చెందిన హోం గార్డ్ అధికారి సిహెచ్. శ్రీనివాస్ కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్ పరామర్శించి, వారికి అండగా ఉంటామని పూర్తి భరోసా కల్పించారు. శ్రీనివాస్ హఠాత్తు మరణం తమను తీవ్రంగా కలచివేసిందని, ఇది పోలీస్ శాఖకు కూడా తీరని లోటు అని ఎస్పీ పేర్కొన్నారు.
మృతుని మరణానికి సంబంధించి ఉన్న అనుమానాలు, ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో కరెంట్ షాక్‌కు గురై మరణించారా లేదా మరేదైనా ఇతర కారణంతో మృతి చెందారా అనే విషయంపై దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసులో వాస్తవాలు తెలుసుకోవడానికి శాస్త్రీయ పద్ధతి అయిన పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ తుది నివేదిక కీలకం అవుతుందని, ఆ నివేదిక వచ్చేవరకు ఎలాంటి ముందస్తు నిర్ధారణకు రావద్దని ఎస్పీ సూచించారు.
ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ కూడా అధైర్యపడకుండా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటామని, కేసు దర్యాప్తు విషయంలో మరియు శాఖ పరమైన సాధ్యమైన అన్ని విధాలా సహకారం అందించడానికి తాము అందుబాటులో ఉంటామని కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్ వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు. జిల్లా అదనపు ఎస్పీ .బి. రాములు నాయక్ , వికారాబాద్ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి , వికారాబాద్ ఇన్స్పెక్టర్ భీమ్ కుమార్ , ఇతర అధికారులు కుడా పాల్గొన్నారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


