జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సోమవారం జిలా కలెక్టర్ ప్రజా వాణి లో కలెక్టర్ లేనందున జాయింట్ కలెక్టర్ కు మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంబానీ బసయ్య ముదిరాజ్ మరియు జిల్లా సహాయ కార్యదర్శి పులరాజుల జంగయ్య ముదిరాజ్ మత్స్యకారుల సమస్యలపైన పిర్యాదు చేశారు.ముఖ్యంగా నేత గీత కార్మికులకు kcr 5o సంవత్సరాలకు వృద్యప్య పెన్షన్ ఇచ్చారు కానీ,మత్స్యకారులకు ఇవ్వలేదు కనుక రేవంతరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడ 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు,మత్స్యకారులు సహాజంగారణం చెందిన ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నారు.ఉచిత చేప పిల్లల బదులు 10 నగదు మత్స్యకారుల అకౌంట్ లో వేయాలన్నారు,మత్స్యకారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నారు, ఈ కార్యక్రమంలో వెంకటయ్య ముదిరాజ్,నర్సింలు ముదిరాజ్,గంగాధర్ సభ్యులు,రాజు,శ్రీశైలం,శ్రీనివాసు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

pension for the fishermen

You cannot copy content of this page