Donation for the Construction : దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ భవన నిర్మాణానికి విరాళం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్, నవంబర్03 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం దేవరకొండ మొదటి అంతస్తు భవన నిర్మాణానికి మద్దెల యాదగిరి రిటైర్డ్ హెల్త్ డిపార్ట్మెంట్, సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశం లో వారి కుటుంబ సభ్యులు 10,116 రూపాయలు నిర్మాణ నిధికి అందజేశారు. ఈ సందర్భంగా సహా అధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సేవాసదనం నిర్మాణానికి దాతల ఆర్థిక సహకారం వెలకట్ట లేనిదని ఆయన అన్నారు. యాదగిరి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పంగనూరు లింగయ్య, సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య ,కార్యనిర్వాహక కార్యదర్శి యూసఫ్ షరీఫ్, పెద్దులు, లక్ష్మణాచారి తదితర సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Donation for the construction

You cannot copy content of this page

Scroll to Top