డిండి (గుండ్లపల్లి) నవంబర్ 03 త్రినేత్రం న్యూస్. డిండి మండలం గోనబోయినపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు గొర్రెల కాపరులు గత పది రోజుల క్రితం సిద్ధాపూర్ వైపు గల గుట్టల పైకి సుమారు 300 గొర్రెలు మేకలను తీసుకొని వెళ్లారు. వాళ్ల వద్ద ఉన్న ఆహార పదార్థాలు నిత్యవసర సరుకులు అయిపోవడం జరిగింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్లు అక్కడే ఉండిపోయారు. ఇట్టి సమాచారాన్ని గ్రామస్తులు డిండి తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్ కు తెలియజేశారు.
తహసిల్దార్ ఈ సమాచారాన్ని దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డికి అందించడం జరిగింది. ఆర్డీవో ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు ఆహార పదార్థాలు అన్ని బ్యాగుల్లో ఏర్పాటు చేసి డ్రోన్ల ద్వారా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన సరుకులను గొర్రెల కాపరులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణారెడ్డి తాసిల్దార్ శ్రీనివాస్ గౌడ్ ఎస్ ఐ బాలకృష్ణ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


