వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ – మైసమ్మ ఆలయాన్ని రక్షించుకుందాం
ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం రైతుల భూములను స్వాధీనం
ఎన్కతల గ్రామ రైతులను నమ్మించి మోసం చేసిన అధికారులు బజరంగ్దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివరాం.. మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో మాదిగోని గుట్ట ప్రాచీన మైన గుడి చరిత్ర పరిసర ప్రాంత ప్రజలు కార్యకర్తలు హిందూ బంధువులు బజరంగ్దళ్ రాష్ట్ర అధ్యక్షులు శివరాంతో కలసి వచ్చి గుడి చరిత్ర వివరంగా వారికి జరిగిన అన్యాయాలను వివరించారు. సమాజానికి న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మాదిగోనీ గుట్టలో రుద్ర మైసమ్మతల్లీ చాలా పవిత్రమైన దేవస్థానం కూల్చడం కుట్ర చేస్తే ఇక ఉద్యమమే అని అన్నారు.
అభివృద్ధి పేరుతో మైసమ్మ ఆలయాన్ని కూల్చివేస్తామనడం సరైనది కాదని టీజీఐఐసీ అధికారులు కూల్చివేతకు గురి చేస్తే బజరంగదళ్ ఎట్టి పరిస్థితుల్లోనైనా పోరడడానికి సిద్ధంగా ఉన్నాం అని హెచ్చరించారు. 198 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో అనాదిగా మైసమ్మ గుడి ఉందన్నారు. ఇక్కడ కొలువైన మైసమ్మ తల్లిని తరాలుగా కొలుస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి భూమిని రైతులకు కేటాయించడంతో దశాబ్దాలుగా గ్రామ రైతులు సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ భూమిని ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వంనికి సేకరించి టీజీఐఐసీకి అప్పగించిందన్నారు. కాగా పరిశ్రమల అభివృద్ధి కోసం పనులు చేపట్టారన్నారు.
ఇందులో భాగంగా మైసమ్మ గుడిని తొలగించేందుకు ఐఐసి అధికారులు సిద్ధమయ్యారని అన్నారు. తరాలుగా తాము కొలుస్తున్న అమ్మవారి గుడిని తొలగించడం సరైనది కాదని ఐఐసీ అధికారులకు పనులు నిలిపివేయవలసిందిగా డిమాండ్ చేశారు. అదేవిధంగా గుడికి కేటాయించిన 11 ఎకరాల భూమిని భూమి పోయిన రైతులకు ప్రతి ఇంట్లో ఒక జాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు కొప్పుల రాజశేఖర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జి శివరాజ్ ప్రధాన కార్యదర్శి మాధవి కార్యదర్శి లక్ష్మయ్య సోషల్ మీడియా ఇన్చార్జి రాఘవేందర్ మీడియా ఇన్చార్జి మోహన్ రెడ్డి విజయలక్ష్మి పట్టణ ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాస్ సీనియర్ నాయకులు సుధాకర్ ఆచారి కొండల్ రెడ్డి శ్రీనివాస్ శ్రీకాంత్ ఎన్కతల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


