Real-Time Voice Alert System : జేగురుపాడు గ్రామంలో రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ వ్యవస్థ ప్రారంభం

TRINETHRAM NEWS

కడియం, త్రినేత్రం న్యూస్. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు గ్రామ సచివాలయంలో ప్రభుత్వ జాతీయ విపత్తుల శాఖ ఆధ్వర్యంలో ఆధునిక రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రథమంగా ఈ గ్రామంలోనే ఈ సిస్టమ్ అమలు చేయడం విశేషం.
ఈ వ్యవస్థ ద్వారా జాతీయ విపత్తులకు సంబంధించిన హెచ్చరికలు 360 డిగ్రీల హార్న్ స్పీకర్ల ద్వారా కిలోమీటర్ పరిధిలోని ప్రజలకు రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ రూపంలో అందజేయబడతాయి. వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, తుఫానులు, వర్షాలు వంటి పరిస్థితులపై ఈ సిస్టమ్ వాయిస్ అలర్ట్స్ మరియు సైరన్‌ల రూపంలో హెచ్చరికలు ఇస్తుంది. ముఖ్యంగా, ఈ పరికరం కరెంట్ అవసరం లేకుండా పనిచేసే విధంగా రూపుదిద్దుకోవడం దీని ప్రత్యేకత.
ప్రస్తుతం ‘మొందా’ తుపాను నేపథ్యంలో ఈ వ్యవస్థ గ్రామ ప్రజలకు గంట గంటకు వాతావరణ సమాచారం అందజేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి IAS కి గ్రామస్థుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ సిస్టమ్ గ్రామ ప్రజలకు విపత్తుల సమయంలో అప్రమత్తతను కలిగిస్తూ ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో మైలురాయిగా నిలుస్తుంది అని సర్పంచ్ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Real-time voice alert system launched

You cannot copy content of this page

Scroll to Top