Medical College : మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాలను తరలించకుండా చూడండి

TRINETHRAM NEWS

జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. కోడంగల్ : అప్పాయిపల్లిలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాల, పాత కోడంగల్ లో ఏర్పాటు చేయనున్న సమీకృత గురుకులాలు శంకుస్థాపన చేసిన స్థలంలోనే ఏర్పాటు చేయాలని కెడిపి జేఏసీ నాయకులు గంటి సురేష్ కుమార్, ఎరన్ పల్లి శ్రీనివాస్, వెంకట్ రామ్ రెడ్డి, భీమరాజు లు పున్నం చందు లాహోటి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎంపీ. డీకే. అరుణకు మెమోరండం అందించారు, మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాలు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని కోడంగల్ లోని ఏర్పాటు చేసే విధంగా చూడాలని, కోడంగల్ ప్రాంతానికి విద్య, వైద్యం లేక కొడంగల్ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాల ఏర్పాటుతో అభివృద్ధి చెందుతుందని భావిస్తే ఇతర ప్రాంతాలకు తరలించడంతో కొడంగల్ ప్రాంతం వెనుకబాటుకు గురవుతుందని వివరించారు, మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాలను తరలించకుండా అప్పాయిపల్లి,

పాత కొడంగల్ లోనే ఏర్పాటు చేసే విధంగా చూడాలని కోరారు, ఎంపీ. డీకే. అరుణ స్పందిస్తూ రైతుల దగ్గర మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పి భూమి తీసుకున్నారో అక్కడే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి కదా అన్నారు, కొడంగల్, తాండూరు నియోజకవర్గాలకు మధ్యన ఉండడంతో రెండు నియోజకవర్గ ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు, అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తో ఫోన్ లో మాట్లాడుతూ అప్పాయిపల్లి లో ఏర్పాటు చేస్తామన్న మెడికల్ కళాశాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, అప్పాయి పల్లి రైతులు, కెడిపి జెఎసి నాయకులు వచ్చారని చెప్పగా అక్కడ వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు, అప్పాయిపల్లి నుండి ఎందుకు తరలిస్తున్నారని ఎంపీ కలెక్టర్ కు అడగగా ఎడ్యుకేషన్ హబ్ చేస్తున్నట్లు తెలిపారు, 220 పడకల ఆసుపత్రి మెడికల్ కళాశాల కోసం నిర్మించారు కదా మరల ఎందుకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు, అప్పాయిపల్లి లోనే కళాశాల ఏర్పాటు చేసే విధంగా చూడాలని కలెక్టర్ కు సూచించారు, కెడిపి జెఎసి నాయకులకు, అప్పాయి పల్లి రైతులకు కళాశాల తరలించకుండా అక్కడే ఏర్పాటు చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో అప్పాయిపల్లి రైతు పకీరప్ప తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Medical College, Integrated Gurukuls

You cannot copy content of this page

Scroll to Top