Trinethram News : Oct 26, 2025, దేశ రాజధాని ఢిల్లీకి నవంబర్ 1, 2025న ప్రత్యేక అధికారిక లోగో లభించనుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ స్థాపక దినోత్సవం సందర్భంగా ఈ లోగోను ఆవిష్కరించనున్నారు. 1,800కు పైగా డిజైన్లను సమీక్షించి, తుది డిజైన్‌ను ఎంపిక చేశారు. ఈ లోగో ఢిల్లీ ఆధునికత, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమం, సంప్రదాయాలు, వారసత్వం, అభివృద్ధి మధ్య సామరస్యాన్ని ప్రతిబింబిస్తుందని సీఎం తెలిపారు. అయితే దేశంలోని అనేక రాష్ట్రాలకు సొంత చిహ్నాలు ఉన్నప్పటికీ, ఢిల్లీకి ఇప్పటివరకు ప్రత్యేక లోగో లేదు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


