TRINETHRAM NEWS

24న రాజధానిలో బందును జయప్రదం చేయండి

అంగన్వాడీల పై రాష్ట్ర ప్రభుత్వ ధమనకాండ కు నిరసనగా జనవరి 24న రాష్ట్రవ్యాప్తంగా జరిగే బందులో రాజధాని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయండి

సిఐటియు రాజధాని డివిజన్ కమిటీ విజ్ఞప్తి

42 రోజుల నుండి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలపై అత్యంత పాశవికంగా, దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయించి, అరెస్టులు చేసి నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ,కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా
ఈ నెల 24వ తేదీ రాజధాని ప్రాంతంలో జరిగే బందు కు
వ్యాపార, వాణిజ్య ,వర్తక వర్గాల వారు, పాఠశాలలు, కళాశాలలు సినిమా హాల్స్ ,హోటల్స్ వారు సహకరించాలని సిఐటియు రాజధాని డివిజన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎం రవి
ఎం.భాగ్యరాజులు సోమవారం నాడు తుళ్లూరులో విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు

అంగన్వాడిలపై
ప్రభుత్వ ధమనకాండ కు నిరసనగా జరిగే ఈ బంధులో రాజధాని లోని రైతులు, కూలీలు ,కార్మికులు, ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారుకోరారు,
బంద్ సందర్భంగా 24వ తేదీన తుళ్లూరులో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.