Congress : పేదల ప్రభుత్వమే కాంగ్రెస్

TRINETHRAM NEWS

తేదీ : 22/10/2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : (త్రినేత్రం న్యూస్); అశ్వరావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంజా.రాజేష్ ,యం. హరినాథ్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ నిరుపేదలకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది అని తెలిపారు. ఉచిత కరెంటు, సన్నబియ్యము, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వాటి గురించి వివరించి చెప్పారు.

అదేవిధంగా సిసి రోడ్లు, వీధి దీపాలు, నీటి సమస్య గురించి పేర్కొన్నారు. శాసనసభ్యులు జారే .ఆదినారాయణ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ సూచించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అధిక మెజార్టీతో గెలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress is the government

You cannot copy content of this page

Scroll to Top