అసెంబ్లీ అభ్యర్థులకు టికెట్లకు సిఫారసు చేసే అధికారం డీసీసీల కు అప్పగింత
మండల, గ్రామ పార్టీ నాయకులకు కీలక అధికారాలు
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం
-శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్
దేవరకొండ డివిజన్ అక్టోబర్ 15 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన సంఘటెన్ సృజన్ అభియాన్ – తెలంగాణ* కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ మరియు ఏఐసీసీ పరిశీలకులు శ్రీ బిశ్వాత్ రాజా మహతి , ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి పాల్గొన్న దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ ఈ ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్లు శాసన సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుల ఎన్నికపై పార్టీ నాయకులు మరియు కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూబలోపేతమవుతోందని తెలిపారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్ఠిగా పనిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ అభ్యర్థులకు టికెట్లకు సిఫారసు చేసే అధికారం డీసీసీలకే ఉంటుందని వెల్లడించారు.
ఈ ప్రక్రియతో మండల, గ్రామ పార్టీ నాయకులకు కీలక అధికారాలు అప్పగిస్తారని వివరించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైందని, పార్టీని గ్రామస్థాయి వరకు విస్తరించి ప్రతి కార్యకర్త చురుగ్గా పాల్గొనేలా అభియాన్ కార్యాచరతో ముందుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ మరియు ఏఐసీసీ పరిశీలకులు శ్రీ బిశ్వాత్ రాజా మహతి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ , నియోజక వర్గ ముఖ్య నాయకులు, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు, మండల మైనారిటి అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, మహమ్మద్ సలీమ్, అబ్దుల్ కలీం, ఖయ్యుమ్, ఉమర్, నూకం వెంకటేష్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


