తేదీ : 15/10/2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; అశ్వరావుపేట నియోజకవర్గం, మండలం, దమ్మపేట మండలాలలో ఉన్నటువంటి అచ్చుతాపురం, మద్ది కొండ, బాలరాజు గూడెం, చిన్నవారిగూడెం అధికార కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, సభ్యులు, ఇంటర్వ్యూలు భాగంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మంచిగా పరిపాలన చేస్తుందని అన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ అర్హులైనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కులం, మతం పార్టీ భాష బేధం లేకుండా అందిస్తుందని తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి , సర్పంచ్ ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలుస్తుందని స్పష్టం చేశారు.
అసలైన నిరుపేదలకు అండగా ఈ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం, ప్రజలకు సమస్య ఏదైనా వస్తే మాకు తెలిసిన వెంటనే స్పందిస్తున్నామని, పరిష్కార మార్గంగా ముందుకు వెళ్తున్నామని సూచించారు. శాసనసభ్యులు జారే . ఆదినారాయణ తన నాయకత్వంలో ప్రతి కార్యకర్తకు, ప్రజలకు అన్ని మంచి విధాలుగా అందుబాటులో ఉంటున్నాడని తెలిపారు. ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని వివరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


