డిండి ( గుండ్లపల్లి )అక్టోబర్ 09 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని బొల్లనపల్లి ( పెద్ద తండా)లో పోషణ మహా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ చంద్రకళ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఇచ్చే ఆకుకూరలు, కూరగాయలు పండ్లు చిరుధాన్యాలు మరియు పరిశుభ్రత గురించి ప్రజలలో అవగాహన కల్పించడం జరిగింది. జింక్ ఫుడ్ ను ఎట్టి పరిస్థితులలో తినరాదని తెలిపారు. అన్న ప్రసన్న, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సెక్టార్ సూపర్వైజర్ రమణ, ఏ డబ్ల్యు టి శోభ, పద్మ ఆయాలు కమ్లి,సైదా ఏఎన్ఎం నిఖత్, చిట్టి సరస్వతి పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


